వింటేనే ఒళ్లు గగుర్పొడిచే రీతిలో మాధవిని గురుమూర్తి చంపాడు.

హైదరాబాద్‌లోని మీర్‌పేట వెంకట మాధవి కేసులో మరో భారీ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇంతకాలం గురుమూర్తి ఒక్కడే ఆమెను చంపేశాడని అనుకున్నారు. కానీ, వెంకట మాధవిని గురుమూర్తి ఒక్కడే చంపలేదని పోలీసులు అనుమానిస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యను హత్య చేయడమే కాకుండా, ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి, ఉడికించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దర్యాప్తు జరుపుతున్న పోలీసులకు లభ్యమైన ఆధారాల ప్రకారం.. గురుమూర్తితో పాటు మరో ముగ్గురు కలిసి మాధవి హత్య చేసి ఉంటారని వారు అనుమానిస్తున్నారు.
ఒక మహిళ పాటు మరో ఇద్దరు పాత్ర ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. గురుమూర్తిని కోర్టు అనుమతితో ఐదు రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్న పోలీసులు అతడిని విచారించారు.
Also Read: ఆ మంటలు ఎలా అంటుకున్నాయి? వైసీపీ ఆఫీసుకి నోటీసులు పంపిన పోలీసులు
గురుమూర్తికి సహకరించిన వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ఇప్పటికే గురుమూర్తి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. అవసరమైతే గురుమూర్తికి పాలీ గ్రాఫ్ టెస్టులు నిర్వహించేందుకు పోలీసుల ప్రయత్నాలు చేస్తున్నారు.
గురుమూర్తి కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్న కొద్దీ కొత్త విషయాలు తెలుస్తున్నాయి. వెంకట మాధవిని హత్య చేసిన గురుమూర్తి ఆమె ఆనవాళ్లు లేకుండా చేయాలనుకుని మటన్ కొట్టే కత్తితో మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు.
అక్కడితోనూ ఆగకుండా ఎముకల నుంచి మాంసాన్ని వేరుచేసి కుక్కర్లో ఉడికించాచి, ఎముకలను కాల్చి దంచి పొడి చేశాడు. వాటిని కవర్లలో కట్టి డ్రైనేజీల్లో, చెరువులో పడేశాడు.